Verse
దుష్టుల ఆలోచన చొప్పున నడువక‖ 2x ‖
పాపుల మార్గములయందు నిలిచి యుండక‖ 2x ‖
Verse
అపాహసించునట్టి ప్రజలు కూర్చుండెడు‖ 2x ‖
ఆ చోట కూర్చుండక యుండువాడే ధన్యుడు‖ 2x ‖
Verse
యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు‖ 2x ‖
ఎల్లప్పుడు ధ్యానము చేయువాడే ధన్యుడు‖ 2x ‖
Verse
కాలువ నీటి యోర నతడు నాటబడి తన‖ 2x ‖
కాలమున ఫలించు చెట్టు వలె యుండును‖ 2x ‖
Verse
ఆకు వాడని చెట్టువలె నాతడుండును‖ 2x ‖
ఆయన చేయునదియెల్ల సఫలమగును‖ 2x ‖
Verse
దుష్ట జనులు ఆ విధముగా నుండక‖ 2x ‖
పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు‖ 2x ‖
Verse
న్యాయ విమర్శ సభలయందు దుష్ట జనులు‖ 2x ‖
నీతిమంతుల సభలో పాపులును నిలువరు‖ 2x ‖
Verse
నీతిమంతుల మార్గము యెహోవ ఎరుగును‖ 2x ‖
నడుపును దుష్టుల దారి నాశనమునకు‖ 2x దుష్టుల ‖