Verse 1
యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన Psalm 1
Verse
దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గములయందు నిలిచియుండక
Verse
అపహసించునట్టి ప్రజలు కూర్చుండెడు
ఆ చోట కూర్చుండక యుండువాడే ధన్యుడు
Verse
యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు
యెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు
Verse
కాలువ నీటియోర నతడు నాటబడి
కాలమున ఫలించు చెట్టువలె యుండును
Verse
ఆకు వాడని చెట్టువలె నాతడుండును
ఆయన చేయునదియెల్ల సఫలమగును
Verse
దుష్టజనులు ఆ విధముగా నుండక
పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు
Verse
న్యాయ విమర్శ సభల యందు దుష్టజనులు
నీతిమంతుల సభలో పాపులును నిలువరు
Verse
నీతిమంతుల మార్గము యెహోవా ఎరుగును
నడుపును దుష్టుల దారి నాశనమునకు