Verse
దుష్టుల ఆలోచనలో నడువక
పాపుల మార్గమున నిలువక
అపహాసకుని చెంతనే కూర్చుండక
నీ ధర్మశాస్త్రమును ఆనందింతును
గాలి చెదరగొట్టు పొట్టు కాను నేను
ఇసుకపైన ఇంటిని కానే కాను
యేసే నా సారమై క్రీస్తే ఆధారమై
నీటియందు నాటబడిన చెట్టునై యుందును
వాడబారక ఫలముల నిచ్చుచుందును