Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. E Samayamandhaina E Sthalamandhaina

ఏ సమయమందైన ఏ స్ధలమందైన

E Samayamandhaina E Sthalamandhaina

Verse
ఏ సమయమందైన ఏ స్ధలమందైన
ఏ స్ధితిలో నేనున్న స్తుతిపాడెదన్‌
ఆరాధన (2) నా ప్రెయుడేసు క్రీస్తుకే ఆరాధన‖ 2x ఆరాధన ‖
ఆరాధన (2) గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధన‖ 2x ఆరాధన ‖
Verse
చెరసాలలో నేను బంధీగా ఉన్నా
సింహాల బోనులో పడవేసినా
కరవు ఖడ్గము హింస ఏదైననూ
మరణ శాసనమే పొంచున్నను
యేసు నామమే ఆధారము కాగ
యేసు రక్తమే నా విజయము
పగటి ఎండలో రాత్రి వెన్నెలలో
కునుకకకాపాడు యేసు దేవునికే ఆరాధన‖ ఆరాధన ‖
Verse
నా జీవనాధారం శ్రీ యేసుడే
నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే
తన చేతులతో నన్ను నిర్మించెగా
నా సృష్టికర్తను కొనియాడెదన్‌
యెహోవా రాఫా నన్ను స్వస్ధపరచున్‌
యెహోవా షమ్మా నాకు తోడుగా
యెహోవా నిస్ని నా ధ్వజముగా
అల్ఫా ఓమేగా ఆది దేవునికే ఆరాధన‖ ఆరాధన ‖

Related Tags

WorshipDevotionalJesus