Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. E sati leni yesuni prema eppudaina

ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా

E sati leni yesuni prema eppudaina

Verse
ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచియించినావా
యిప్పుడైనా ఆశించి రావా
Verse
నీ దేవుండెవరు నీ పూజెవ్వరికి నశియించె వెండి బంగారాలకా
నిజ దైవమెవరు నీ రక్షకుడెవరు నీవెన్నడైనా తలచావా
నీకున్న లోటెరిగినావా
Verse
కలువరి గిరిపై విలువైన ప్రాణం అర్పించి మరణించిందీ నీ కొరకై
నిన్నెంతగానో ప్రేమించినట్టి నీ దేవుని ప్రేమ
గ్రోలన్ మోదంబున రావదేల
Verse
వేదంబులందు వ్రాయబడినట్లు ఈ ధరను రక్షింప నవతరంచి
బలియాగమైన ప్రభు యేసు కాక మరి ఎవ్వరైనను కలరా
మనసారా యోచించిరావా

Related Tags

SalvationJesusLove