Verse 1
మానసవీణను శృతిచేసి - మనసు నిండా కృతజ్ఞత నింపి
గొంతెత్తి స్తుతిగీతములే పాడవా
వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా
Verse 2
వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా
సాయంసమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా
స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట మేలుకరం
దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం ||మానసవీణ ||
Verse 3
శ్రమలతో తడబడితే ప్రార్థనతో సరిచేయి
దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీయి
మనమే జగతికి వెలుగిస్తే - విశ్వాసగళాలు కలిస్తే
స్తుతిధూపం పైపైకెగసి దీవెనలే వర్షింపవా ||మానసవీణ ||