Verse 1
జ్ఞాన వివేకములకు ఆధారమైన దైవ ఆత్మ
ఆలోచన బలములను అందజేయు దివ్య ఆత్మ
తెలివిని తలాంతులను - దేవుని యెడ భయభక్తులను
పుట్టించు ఆత్మ - పోషించు ఆత్మ - 2
Verse 2
దైవవాక్కు ద్వారానే - ఆదరించు కార్యముకై
పంపబడిన ఆత్మ - ఉద్దరించు ఆత్మ
పొందుకున్న వారికి దైవజ్ఞాన వరములను
దీవించి మనకు దయచేయు ఆత్మ - 2 ||అతడే ||
Verse 3
సత్యవేదసారమును గోచరమగు రీతిలో
బోధచేయు ఆత్మ శక్తి నిచ్చు ఆత్మ
దాసులైన వారికీ - పరమ రాజ్య మర్మములు
ప్రేమించి కృపతో - నేర్పించు ఆత్మ - 2 ||అతడే ||
Verse 4
క్రీస్తుయేసు పోలికతో - ఆత్మలో ఫలించుటకు
కృపనుచూపు ఆత్మ - పరము చేర్చు ఆత్మ
సిద్ధపడినవారిని - శుద్ధసువర్ణ వీధులలో
నడిపించు ఆత్మ - మురిపించు ఆత్మ - 2 ||అతడే ||
Verse 5
అతడే పరిశుద్ధాత్మ - 2