Verse 1
పాపిని కరుణించుమా నా కాపరి దయజూపుమా
మందను వీడి ఒంటరినైతి నన్నుదరి జేర్చుమా
Verse 2
ఇహలోక వాంఛలతో నిన్ను వీడి బహుదూరమైతిని
మహారాజ నీదు సహవాసమునకు
నన్ దిరిగి చేర్చుమా సాయంబు చేయుమా || 2 || ||పాపిని ||
Verse 3
ఈ కొండలందు నేనుండ నాకు వేరండలేదయా
ఈ గండములను దాటించి నన్ను
నీయండ చేర్చుమా నీచుండ బ్రోవుమా ||పాపిని ||
Verse 4
గిరి మృగములెల్ల నన్ దరిమి తరుమ నేనలసి పోతిని
ప్రభుకరము చాపి నీ కరుణ చూపి
నీదరికి చేర్చుమా కనికరము చూపుమా ||పాపిని ||
Verse 5
ఈ మాయలోక పాశాలలోన బంధితుడనైతిని
బహుగాయపడిన నీ ప్రక్క జేర్చి స్వాతంత్య్ర
మీయుమా నీ మంద జేర్చుమా ||పాపిని ||