Verse 1
సంగీతములతో దేవుని - స్తుతించెదము ఎల్లప్పుడూ
అణకువ, శ్రమ, శాంతములతో - అభినందించుడి యేసునీ
Verse 2
పాపపు చీకటినుండి - విడిపించిన మన ప్రభునీ
శాపపు భారము మోసిన ప్రభునీ - ఘనపరచుడీ స్తుతులతో ||సంగీతము ||
Verse 3
ప్రభునికి కలిగిన మనసును - ఆయుధముగను ధరించి
మన పొరపాటులు సరిచేసికొనుచు - మాదిరి బ్రతుకును చూపుదం ||సంగీతము ||
Verse 4
నోటి మాటల ద్వారా - హృదయ తలంపుల ద్వారా
ఆత్మవరముతో, ఆవేదనతో - అనుసరించెదము ప్రభునీ ||సంగీతము ||