Verse 1
ప్రేమ చిందెను - సిలువ ప్రేమచిందెను
జల్లులై రక్తపు జల్లులై - వెల్లువలై - కృపా వెల్లువలై
Verse 2
ఎండిన పువ్వుగా - నే కృంగిన పాపిగా
దూరముగా నుండగా - బహుభారముతో అలయగా
తడిపెను ప్రేమ ప్రవాహం - కడిగెను రక్త ప్రభావం
నింపెను యేసు నూతన జీవం ||ప్రేమ ||
Verse 3
ఆత్మలో నేను నలుగగా - జీవితమంతా వేసారగా
పగిలిన పాత్రగా - నేచెదరి - పడియుండగా
తడిపెను ప్రేమ ప్రవాహం - కడిగెను రక్త ప్రభావం
మలిచెను నూతన పాత్రగ నన్ను ||ప్రేమ ||