Verse 1
ధవళ సింహాసనాసీనుడౌ - జగతి కంతకు నాధుడౌ
ప్రభుని కిదియే స్తోత్రము - యేసు ప్రభుని కిదియే స్తోత్రము
Verse 2
ఆత్మ స్వరూపా ఆది సంభవా - అనాది మధ్యలయుడవు నీవే
సర్వము నీవే సకలము నీవే - సకల చరాచర జీవమునీవే ||ధవళ ||
Verse 3
ఇద్దరు ముగ్గురు నీ నామమున - కూడిన ఈ కువలయమందున
నిలిచెదననుచు పలికిన ప్రభువా - మహిమ ప్రభావము నీకే దేవా ||ధవళ ||
Verse 4
పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు - నిరతమునీవే స్తుతి పాత్రుడవు
స్తుతులపై ఆసీనుడ నీవు - మా స్తుతి స్తోత్రముల్ గొనుమా దేవా ||ధవళ ||