Verse 1
నా కన్నీటిని తుడిచే వాడు నా యేసుడు
నా నోటి నిండా నవ్వుంచు వాడు నా యేసుడు
వేదనలో, శోధనలో ఓదార్పు నాయేసుడు
Verse 2
కొండల తట్టు కన్నులెత్తి చూచుచున్నాను
దేవుని చేత సాయము నేను కోరుచున్నాను
ఏ అపాయము రాకుండ నిన్ను కాపాడు వాడాయెనే ||నా కన్నీటిని ||
Verse 3
పాతాళమున పండుకున్న అక్కడ ఉన్నాడు
భూదిగంతము లందు కూడా నడిపించుచున్నాడు
వేకువ రెక్కలు కట్టి సాగరాన సాగిపోయి, ఆయన హస్తము నడిపించును ||నా కన్నీటిని ||