Verse 1
శరణం - నీదివ్య చరణం - నీ నామమెంతో మధురం - 2
ఓ యేసు దేవా నిన్నే స్తుతింతును మనసారా - 2
Verse 2
నీతి సూర్యుడా నిత్యనివాసీ - నీతిమంతుడా పరిశుద్ధుడా - 2
అద్భుతములు చేయుదేవుడవు నీవే
నీ నామస్మరణెంతో మధురం - మధురం - 2 ||శరణం ||
Verse 3
మాకోసమే - మహికి అరుదెంచినావు
మమ్మాదరింప - మదిలో నివసించినావు - 2
నిజమైన ద్రాక్షవల్లివి నీవే
నీలోనె ఐక్యమగుట ధన్యం ధన్యం - 2 ||శరణం ||