Verse 1
ముందుగా తన కోసం - నిన్నెనుకున్నాడు
జగతి రూపులేనప్పుడే -2
పరిశుద్ధ పాత్రగా - నిన్ను వాడుకోవాలని
తల్లిగర్భమందే నిన్ను - ఏర్పరచుకొన్నాడు
Verse 2
తన రూపమందు నిన్ను తనచేతి పనిగాను
మంటినుండి నిన్ను మలచి - జీవాత్మనిచ్చాడు
తనతోడనుండాలని - తన కోసం బ్రతకాలని ||పేరు ||
Verse 3
నిట్టూర్పు నాపేవాడు - కన్నీరు తుడిచేవాడు
నీ నిందనే తొలగించి - నిన్నాదరించేవాడు
కష్టాలలో నిన్ను - ఓదార్చువాడు ||పేరు ||
Verse 4
సుందరమగు ద్రాక్షావనిగా నిన్ను నాటుకున్నాడు
అనుక్షణం నిన్ను గమనించి కాపుకాయుచున్నాడు
కొమ్మ కాపుకాయాలని ఫలముతోడ నిండాలని ||పేరు ||
Verse 5
పేరు పెట్టి పిలిచాడేసయ్యా సహనముతోడ
చేయి చాపి నిలిచాడేసయ్యా