Verse 1
నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని
ఊపిరితో మిగిలెదనా ఉదయానికి
తడవు చేయక యేసు నను చేరుకో
నా ప్రక్కనే ఉండి నను పట్టుకో
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా ||నిశిరాత్రి||
Verse 2
ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం
కనిపించక దారులు మొదలాయెను కలవరము
వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా
తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని
నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు ||నిశిరాత్రి||
Verse 3
నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి
నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి
ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు
రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి
ఉదయమును చూపించుము నా కంటికి
Verse 4
అల్పము ఈ జీవితమని నేనెరిగితిని
కనురెప్పపాటున ఆవిరికాగలదు
అనుదినమిక నీ కృపనే నే కోరుచు
పయనింతును నా గురివైపు నిను ఆనుకుని
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా