కొండలతో చెప్పుము కదిలిపోవాలని
బండలతో మాట్లాడుము కరిగిపోవాలని (2)
నమ్ముట నీ వలనైతే
సమస్తం సాధ్యమే – (3)
మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
మనసులో సందేహించక మాట్లాడు
మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు
యేసుని నామములోనే మాట్లాడు ||కొండలతో||
యేసయ్య ఉన్న దోనె పైన తుఫాను కొట్టెనే
యేసయ్య దోనె అమరమున నిద్రించుచుండెనే
గాలి పైకి లేచి – అలలు ఎంతో ఎగసి
దోనెలోనికొచ్చెను జలములు జోరున
శిష్యులేమో జడిసి – వానలోన తడిసి – బహుగా అలసిపోయే
ప్రభువా ప్రభువా – లేవవా త్వరగా
మేము నశించిపోతున్నామని
ప్రభువును లేపిరి – తమలో ఉంచిన – దైవ శక్తి మరచి
రక్షకుడు పైకి లేచాడు – శిష్యులకు చేసి చూపాడు
పరిస్థితుత్లతో మాటలాడాడు
ఆ గాలినేమో గద్దించి – తుఫాన్ని ఆపేసి – నిమ్మల పరిచాడు
శిష్యులను తేరి చూచాడు – విశ్వాసం ఎక్కడన్నాడు
అధికారం వాడమన్నాడు
ఇక మనమంత ప్రభు లాగ – చేసేసి గెలిచేసి
ప్రభునే స్తుతిద్దాము – జై
జై జై జై జై జై జై జై జై
ఈశు మసీహ్ కి జై
ఈశు కే జై జై జై
ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు||
పరలోక రాజ్య తాళాలు మన చేతికిచ్చెనే