Verse 1
ఆరాధన ఆరాధన ప్రభుయేసుక్రీస్తుకే ఆరాధన
స్తుతికీర్తన స్తుతికీర్తన దేవాది దేవునికె స్తుతికీర్తన
జీవాధిపతియైన యెహోవకు ప్రభువుల ప్రభువైన యేసునకు
నేపాడెదన్ కొనియాడెదన్ - కొనియాడి కీర్తించెదన్
Verse 2
చీకటి నుండి వెలుగునకు నడిపెను నను క్రీస్తు
మరణము నుండి జీవముకు నడిపెను నను క్రీస్తు - 2
మార్గము సత్యము జీవము ఆ యేసే - 2
నా సర్వము నా శైలము నా ఉన్నతమైన కోట - 2 ||ఆరాధన ||
Verse 3
మోడైపోయిన నా బ్రతుకును చిగురింపజేసెను ప్రభుయేసు
తన ద్రాక్షవల్లిలొ ఒక తీగెగా నాటెను నను క్రీస్తు - 2
ఆత్మ ఫలములు ఫలియించెదన్ నాదు ప్రభుయేసులో - 2
చిరకాలము నా యేసుకై ఇలలో జీవించెదన్ - 2 ||ఆరాధన ||