Verse
నేను నా ఇల్లు నా ఇంటివారందరు
మానక స్తుతించెదము
నన్ను పిండము వలె కాచావు స్తోత్రం
నే చెదరక మోసావు స్తోత్రం
Chorus
ఎబినేజరు..ఎబినేజరు..ఇంతవరకు మోసితివే
ఎబినేజరు..ఎబినేజరు..నా తలంపుతోనే నున్నావే
స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం….
హృదయములో మోసితివే స్తోత్రం
స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం….
పిండము వలె మోసితివే స్తోత్రం
Verse
ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును
మేలులతో నింపితివే
ఎట్టి కీడైన తలంచని నీవు
ఏ తండ్రైన నీలాగ లేరు
Verse
అనుదినము నా అవసరతలన్నియు
పొందితి నీ కరము చే
నీ నడిపింపు వివరించలేను
ఒక పరిపూర్ణ మాటైన లేదు
Verse
జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను
పిలిచినది అధ్బుతము
నేను దేనికి పాత్రను కాదు
ఇది కృపయే వేరేమి లేదు