Verse
ఎబినేజరే 2‖ 2x ‖
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము‖ 2x ‖
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం‖ 2x ‖
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే‖ 2x ‖
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం‖ Nenu ‖
Verse
ఎడారిలో ఉన్న నా జీవితమును
మేలుతో నింపితివే‖ 2x ‖
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం‖ 2x Ebinejare ‖
Verse
నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే‖ 2x ‖
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి‖ 2x Ebinejare ‖
Verse
జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యమాశ్చర్యమే‖ 2x ‖
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం‖ 2x Ebinejare ‖