Verse 1
మంచి పోరాటం పోరాడి సాగి పోదము
వల్లభుని మంచి మార్గం వెంబడింతుము
Verse 2
వేలకొలది పందెమందు పరుగులెత్తినన్
విజయం పొందువాడు ఒకడు మాత్రమే గదా ||భారం ||
Verse 3
వెనుక నున్న వన్నియు మరిచిపోదము
ముందు ఉన్న వాటికొరకు పరుగులెత్తుదం ||భారం ||
Verse 4
ఎట్టి సమయమైన సైతానడ్డు వచ్చును
భయపడకు దేవదూత కావలుండును ||భారం ||
Verse 5
అడవిలోయ చూచి సందేహ పడకుడి
పరుగెత్తి పోవుటకు బలము పొందుదం ||భారం ||
Verse 6
పరుగులెత్తు వారనేకుల్ ముందు వచ్చినా
లోతు భార్యవలె వెనుక చూచి నిలచిరి ||భారం ||
Verse 7
అటు ఇటు చూచితే నీవు ముందు కెళ్ళవు
విజయముతో పరుగు తీస్తే కిరీటము దొరుకును ||మంచి ||
Verse 8
భారం పాపం విడచి గురిని చూచి
చక్కగ ముందుకు నడచిపోదము