Verse 1
నమ్మదగిన దేవుడు - నాయేసునాధుడు
నమ్మదగని మానవులను - నమ్ముతున్న దేవుడు
Verse 2
దారితప్పి దూరదేశం నేపోయినపుడు
గొఱ్ఱెలాగ మూర్ఖనైజం నేచూపినపుడు
చేరదీసి ప్రేమచూపి నన్ను క్షమియించాడు
కరుణామయుడు దీర్ఘ శాంతపరుడు ||నమ్మదగిన ||
Verse 3
వరములెన్నో కుమ్మరించి నన్ను దీవించాడు
తీవ్రమైన సంక్షోభములో నన్ను ఆదరించాడు
మేరలేని తనవాగ్ధానం నాకు ఇచ్చి మనిపాడు
మరువలేని జాలిచూపి నన్ను ఆదుకొన్నాడు ||నమ్మదగిన ||
Verse 4
పలువిధాల బోధలెన్నో నాకు అందించాడు
విలువలేని నాకు ఎంతో విలువనిచ్చి నిలిపాడు
కలుషహరుడు కాంతిమయుడు అమల కన్యసూనుడు
సిలువధరుడు లోకవిభుడు నాదు నజరేయుడు ||నమ్మదగిన ||