Verse
ఎడబాయని దేవా - ఇమ్మానుయేలు ప్రభువా
మరువక విడువక నీ జనాంగమును నిత్యము కాచెడి దేవా
Chorus
స్తుతులను చెల్లింతును - స్తోత్రములర్పింతును
Verse
నీదు మాటను లక్ష్యము చేయక ఎంతగానో విసికించినా
నీకు విరోధముగా తిరుగబడి బహుకోపము పుట్టించినా
నలువది ఏండ్లు నీ జనాంగమును ప్రేమతో కాచిన దేవా
Verse
నీ సహాయము మాకు లేనిచో ఎపుడో నశించియుందుము
నీదు హస్తము మాతో రానిచో మౌనములో దిగియుందుము
గడచిన ఏండ్లు నీ జనుల మమ్ము దయతో కాచిన దేవా