Verse
ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ‖ 2x ‖
నన్నెంతగానో బలపరచెను
నన్నెంతగానో స్థిరపరచెను‖ 2x ‖
నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను
నన్నెంతగానో స్థిరపరచెను‖ 2x ఎడబాయని ‖
Verse
కన్నీటి లోయలలో నుండి
నన్ను దాటించిన దేవా
సింహాల బోనులలో నుండి
నన్ను విడిపించిన ప్రభువా‖ 2x నన్ను బలపరచెను ‖
Verse
నేనున్నతమైన స్థితిలో
ఉండాలని ఆశించితివా
ఏ అర్హత నాకు లేకున్నా
నా కృప నీకు చాలునంటివే‖ 2x నన్ను బలపరచెను ‖
Verse
నేనెదుర్కొనలేని పరిస్థితులు
నా ఎదుట ఉన్నవి దేవా
నీ శక్తిని నేను కోరెదను
నన్ను విడిపించు నా దేవా‖ 2x నన్ను బలపరచెను ‖