Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Edabayani Nee Krupa

ఎడబాయని నీ కృప

Edabayani Nee Krupa

Lyricist: Pastor Mathews
Chorus
ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ‖ 2x ‖
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం‖ 2x Edabayani ‖
Verse
శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో – నిరాశ నిసృహలో‖ 2x ‖
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగా‖ 2x ‖
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి‖ 2x Edabayani ‖
Verse
విశ్వాస పోరాటములో – ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో‖ 2x ‖
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగా‖ 2x ‖
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి‖ 2x Edabayani ‖
Verse
నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని‖ 2x ‖
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగా‖ 2x ‖
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి‖ 2x Edabayani ‖

Related Tags

FaithGraceGods Love