Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Edhi Naa Vishranthi Yee Lokamandhu Ne

ఏది నా విశ్రాంతి యీ లోకమందు నే

Edhi Naa Vishranthi Yee Lokamandhu Ne

Lyricist: Purushothamu Choudari
Chorus
ఏది నా విశ్రాంతి యీ లోకమందు నే దిక్కు గనుఁగొన్న లేదు సుఖ
మెందు మేదురా మోద ని త్యోదగ్ర మోక్ష పుట భేదమున
చొరకున్న లేదు సుఖ మెచట‖ ఏది ‖
Verse
కష్టములు తెరతెరలు గా వచ్చిన మదాత్మ దృష్టి దప్పక యోర్చి
తీరమంద వలయున్ స్పష్టమగు నా త్రోవ పయనంబు తుద ముట్టు
శ్రేష్ఠ మగు నా యిల్లు చేరు నందాక‖ ఏది ‖
Verse
కోరింద పొదచుట్టు కొనియుండ నిమ్ము నేఁ గోర నిచట గులాబి
కుసుమ శయనంబు నేరీతినైన నా యేసు రొమ్మునఁ జేరి భూరిసుఖ
మొందెద వి చార మిఁక నేల‖ ఏది ‖
Verse
యేసుప్రియ మించు కే నెఱిఁగి కన్గొను వేళ నా సంతసము నిండు
పాసి చనె వెతలు భాసురంబుగ మంచు పగిదిఁ దళ తళలాడఁ జేసె నా
కన్నీళ్లు చింత లెడఁబాపి‖ ఏది ‖
Verse
ఉండునే సందియము లుండునే దుఃఖములు గండములు ఢీయను చు
బైకి రాఁ గలవే మెండుగా మధురమై యుండు మోక్షము నాకుఁ
దండ్రితో గడియ సే పుండిననుఁ జాలు‖ ఏది ‖
Verse
నడుము పై నొక సంచి బడెకఱ్ఱ చేతిలో నిడికొనుచు శత్రువుల
పుడమి వే గడుతున్ నడుదారి కరుకు నె న్నక వేగ రక్షింపఁ బదుదునని
పాడి చని పరమసుఖి నౌదు‖ ఏది ‖

Related Tags

ComfortHeavenRest