Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Edhi Sakhuda Yedhi Nee Madhini Jesikona

ఏది సఖుడ యేది నీ మదిని జేసికొన

Edhi Sakhuda Yedhi Nee Madhini Jesikona

Lyricist: Chetti Bhanumurthy
Chorus
ఏది సఖుడ యేది నీ మదిని జేసికొనిన ప్రతిన యేది నీవొసంగు కాను
కిదియె తరుణమీయరమ్ము‖ ఏది ‖
Verse
అన్న వస్త్రంబు లిచ్చి యాలు బిడ్డల ననుగ్రహించి యన్ని వస్తువుల నిచ్చి
యున్న నా కెదురుకాను‖ ఏది ‖
Verse
వ్యాధి బాధలొదినపుడు శోధనంబు లడరినపుడు ఏది యెప్పుడవసరం
బది యొసంగి యాదిరించితి‖ ఏది ‖
Verse
మనసు శాంతిలేక నీవు మదిని బొగలుచుండ జూచి కనని వినని ప్రేమ
జూపి కనికరించినట్టి ప్రభుని‖ ఏది ‖
Verse
పాపమందు పడినాడు దాపుజేరి నిలుపలేద? కాపరివలె నిన్ను గాచి
యోపికతో నడుపలేద‖ ఏది ‖
Verse
ఏమి దాచినావో సఖుడ! ఏమి తెచ్చినావు నేడు? నీ మనసు నిండ
ప్రేమయున్న నదియే నాకు వేనవేలు‖ ఏది ‖

Related Tags

WorshipThanksgiving