Chorus
ఏదియది యేదియది యేదిరా మన దేశము పాదుకొన్న లౌకికునకు
బహుళ దుఃఖ పాశము‖ ఏదియది ‖
Verse
సిలోమను కొలను గల జీవన ప్రదేశము పాలు తేనె లొల్కు నట్టి
పరమ కానాన్ దేశము‖ ఏదియది ‖
Verse
ఆయతమై యున్నదది యమర జనుల కోసము సీయోనను పేరుగల
శ్రీకరుని నివాసము‖ ఏదియది ‖
Verse
జీవ ప్రవాహములు గల జీవుల స్వదేశము కేవల పరిశుద్ధమైన కెరు
బుల స్వదేశము‖ ఏదియది ‖
Verse
యేసు జన స్వాస్థ్య మిదే యిశ్రాయేలు దేశము మేసయ్య యను రాజుసదా
మృతములిడు దేశము‖ ఏదియది ‖
Verse
కోరికలు దీరునట్లు గొబ్బుననేఁ బోదురా చేరి సౌఖ్యమొంద మదిని
స్ధిరతఁ బూని యుంటిరా‖ ఏదియది ‖
Verse
మరణమును యోర్దాన్ నది మధ్యమందు గంటిరా తరుణమునేఁ గాచి
దాని దాటిపోవ నుంటిరా‖ ఏదియది ‖
Verse
కాలు ధరను నిల్వదది కండ్లుఁబడు దాకరా మేలుకొని యుంటిరా
మేర దాట లేకరా‖ ఏదియది ‖