Chorus
ఎదురు చూచెదము దృఢపునాదిగల పట్టణమునకై
దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు - మన ముల్లసించెదము
Verse
ఆ నగరములో ప్రభుమహానీయుడు - స్తుతులకు పాత్రుడుతానే
దేవుడా పట్టణమందున గలడు - కదలడు ఎన్నటికిన్
Verse
దృఢముగానున్న దేవుని నగరుకు - చుట్టు ప్రాకారము గలదు
తన సిమ్హాసనమందున గలడు - రాజాధి రాజాయనే
Verse
ప్రభు పట్టణమున నిత్యసంతోష - శాంతి విజయములు గలవు
నీతిమంతులు సదాస్తుతులు పాడెదరు - ప్రభువారితోడ నుండ
Verse
జయవంతు లందరు ఆ నగరమున - నిత్యము నివసించెదరు
భూమి పునాదులు వేయకమునుపే వారికై సిద్ధపరచెన్
Verse
ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండు
వెళ్ళగోరినచో యేసుని నమ్మి రక్షణ పొందుము