Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Dinam Kreesthu Janma Dinam

ఈ దినం క్రీస్తు జన్మ దినం

Ee Dinam Kreesthu Janma Dinam

Lyricist: Krupadas Kollati
Verse
ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం‖ 2x ‖
ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో‖ 2x ఈ దినం ‖
Verse
దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం‖ 2x ‖
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం‖ ఆడుము ‖
Verse
పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును‖ 2x ‖
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము‖ ఈ దినం ‖

Related Tags

WorshipChristmasCelebration