Verse
ఈ దినం సదా నా యేసుకే సొంతం
నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును‖ 2x ‖
రానున్న కాలము – కలత నివ్వదు‖ 2x ‖
నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును‖ ఈ దినం ‖
Verse
ఎడారులు లోయలు ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాటయైనను‖ 2x ‖
వెరవదెన్నడైనను నాదు హృదయము‖ 2x ‖
గాయపడిన యేసుపాదం అందు నడచెను‖ 2x ఈ దినం ‖
Verse
ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
యుద్ధకేక నా నోట యేసు నామమే
విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు
యెహోవా నిస్సియే నాదు విజయము‖ ఈ దినం ‖