Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Dinam Shubha Dinam

ఈ దినం శుభ దినం

Ee Dinam Shubha Dinam

Chorus
ఈ దినం శుభ దినం
ఈ లోకానికే పర్వ దినం‖ 2x ‖
ప్రకృతి పరవసించెను
ప్రతి హృదయము పులకించెను‖ 2x ‖
శుభం శుభం నీకు శుభం‖ 2x ‖
ఈ లోకానికే శుభ దినం‖ 2x ‖
Verse
రాజుల రాజుగా ప్రభు యేసు జన్మించెను‖ 2x ‖
తన ప్రజల వారి పాపము నుండి
విడిపించి రక్షింపను‖ 2x శుభం ఈ దినం ‖
Verse
మహిమా స్వరూపుడు క్రీస్తుగ జన్మించెను‖ 2x ‖
నిత్య జీవమును శాశ్వత ప్రేమను
సమాధాన మిచ్ఛుటకు‖ 2x శుభం ఈ దినం ‖
Verse
శ్రీమంతుడైన దేవుడు
దీనునిగా జన్మించెను‖ 2x ‖
దీనులను ధన్యులను చేసి
ఆశీర్వదించుటకు‖ 2x శుభం ఈ దినం ‖

Related Tags

ChristmasNativityCelebration