Chorus
ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని బిలువగ రారండి ఆయన రానిదె
దీవెనలు ఆశీర్వాదము లరుదగును‖ ఈ గుడి ‖
Verse
ఆకా శము మన దేవునికి అత్యున్నత సింహాసనము పాదములకు యీ
భూమియును పీఠముగా నొప్పును సుమ్ము‖ ఈ గుడి ‖
Verse
ఆయన సన్నిధి కాంతియె యీ ఆలయమంతట నిండుకొనన్ ఆయన
యాత్మ సహాయమున ఆరాధనలను జరుపుటకై‖ ఈ గుడి ‖
Verse
నిర్మలమైన సువార్తను బో ధింపగ సాయము జేయుటకు బోధకు లైన
సువార్తికుల బోధను నాటగ జేయుటకు‖ ఈ గుడి ‖
Verse
ప్రార్థన విశ్వాసాయుతమౌ భక్తిని నేర్పెడి నిలయముగ భక్తులు దేవుని
సన్నిధిలో బాగుగ స్థిరపడ జేయుటకు‖ ఈ గుడి ‖
Verse
ఈ పట్టణమున వెలుగుటకు ఈ ప్రజలందరి రక్షణకు ఈ గుడి యీ
సభ బలపడుచు సాగుచు వృద్ధిని జెందుటకు‖ ఈ గుడి ‖
Verse
బాప్తిస్మము నిర్ధారణలు ప్రభు భోజన సంస్కారములు బాగుగ
జరుగుచుండుటకు భక్తిని పెంపొదించుటకు‖ ఈ గుడి ‖
Verse
తండ్రి కుమార శుద్ధాత్మకు తావుగ నీ గుడియుండుటకు త్రేకుని దీవెన
వర్షములు దీనిపై నిరతము కురియుగాక‖ ఈ గుడి ‖