Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Jeevitha Eetha Eedhalekunnaanu

ఈ జీవిత ఈత ఈదలేకున్నాను

Ee Jeevitha Eetha Eedhalekunnaanu

Verse 1
ఈ జీవిత ఈత ఈదలేకున్నాను
నా చేయి పట్టుకో నా యేసునాధా
Verse
సారహీనమగు సంసారాబ్దిలోన సాగలేకున్నాను
సాయంబురావా సారాకరుణారసధారలే నా కొసగుము
సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము
Verse
సంఘసంబంధముగ శాంతి లేకపోయె సమానతత్వంబు
సమసిపోయె సోదరులే నాకు శత్రువు లయ్యిరి
సమాధానము నొసగ సరగున రావా‖ ఈ ‖
Verse
బయట పోరాటములు భయపెట్టుచుండెను బంధువులందరు
బహుదూరులైరి భార్యపుత్రాదులచే బాధలెన్నో గలిగె
బాధలన్నియు బావ బహుత్వరగ రావా‖ ఈ ‖
Verse
రాజ్యముపై రాజ్యంబు రంకె వేయుచుండె రాష్ట్రముపై
రాష్ట్రంబు రగులుచుండె రాజులకు రాజువై రయమున
రావయ్య రాజ్యమేలను ధరణిలో రమ్ము రమ్ము‖ ఈ ‖
Verse
సైతాను చెలరేగి సమయం బిక లేదని సింహపురీతిగా
గద్దిచుచుండె సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి
సమాధానరాజ్యం స్థాపించరావా‖ ఈ ‖
Verse
మొదటి జామయ్యెను మీరింక రారయ్యె రెండవజామున
జాడలేదె మూడవ జామయ్యె మీరింకా రారయ్యొ
నాలుగవ జామున నడచివస్తున్నారా‖ ఈ ‖
Verse
పెండ్లికుమారుండ ప్రభువైన క్రీస్తుండ పెండ్లిసంఘము
నాత్మయు బిలుచుండె పెండ్లివిందులో నేను పెండ్లి
వస్త్రముతోను హల్లెలూయ యని ఆనందింతున్‖ ఈ ‖

Related Tags

PrayerSupplication