Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Jeevitham Viluvainadi

ఈ జీవితం విలువైనది

Ee Jeevitham Viluvainadi

Lyricist: Satyaveda Sagar
Verse
ఈ జీవితం విలువైనది
నరులారా రండని సెలవైనది‖ 2x ‖
సిద్ధపడినావా చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు‖ ఈ జీవితం ‖
Verse
సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు‖ 2x ‖
పోతున్నవారిని నువు చుచుటలేదా‖ 2x ‖
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా‖ 2x ఈ జీవితం ‖
Verse
మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు‖ 2x ‖
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి‖ 2x ‖
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి‖ 2x ఈ జీవితం ‖
Verse
పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు‖ 2x ‖
యేసు రక్తమే నీ పాపానికి మందు‖ 2x ‖
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు‖ 2x ఈ జీవితం ‖

Related Tags

RepentanceSalvationLifeDeath