Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Jeevithamannadhi Kshanakaalamainadhi Paralokamlinidhi Shashwathamainadhi

ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది

Ee Jeevithamannadhi Kshanakaalamainadhi Paralokamlinidhi Shashwathamainadhi

Lyricist: Praveen Vb
Chorus
ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది‖ 2x ‖
ఆస్తులు ఎన్ని ఉన్న అంతస్తులు ఎన్ని ఉన్న
క్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్నా‖ 2x ‖
Verse
గొప్ప ప్రణాళికా నాకై సిద్దము చేసి తల్లి గర్భంలో రూపించావు‖ 2x ‖
సృష్టాంతటిని నీ నోటిమాట ద్వారా చేసావు
పరిశుద్ధమైన చేతులతో నన్ను చెక్కావు‖ 2x ‖
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న‖ 2x ‖
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా‖ 2x Ee Jeevithamannadhi ‖
Verse
ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్దము చేసి
నీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు‖ 2x ‖
తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకై
దీనునిగా ఈ భువిపై నీవు జన్మించావు‖ 2x ‖
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న‖ 2x ‖
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా‖ 2x Ee Jeevithamannadhi ‖

Related Tags

LifeGods LoveEternity