Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Loka Yaathraalo Ne Saaguchunda

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ

Ee Loka Yaathraalo Ne Saaguchunda

Verse
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ‖ 2x ‖
ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు‖ 2x ‖
అయినాను క్రీస్తేసు నా తోడనుండు‖ 2x ఈ లోక ‖
Verse
జీవిత యాత్ర ఎంతో కఠినము‖ 2x ‖
ఘోరాంధకార తుఫానులున్నవి‖ 2x ‖
అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు‖ 2x ‖
కాయు వారెవరు రక్షించేదెవరు‖ 2x ఈ లోక ‖
Verse
నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా‖ 2x ‖
అనుదినము నన్ను ఆదరించెదవు‖ 2x ‖
నీతో ఉన్నాను విడువలేదనెడు‖ 2x ‖
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను‖ 2x ఈ లోక ‖
Verse
తోడై యుండెదవు అంతము వరకు‖ 2x ‖
నీవు విడువవు అందరు విడచినను‖ 2x ‖
నూతన బలమును నాకొసగెదవు‖ 2x ‖
నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే‖ 2x ఈ లోక ‖

Related Tags

FaithComfortLife Journey