Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Loka Yaathralo Ne Saaguchunda Okasaari Navvu Okasaari Yedpu

ఈ లోక యాత్రలో నే సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు

Ee Loka Yaathralo Ne Saaguchunda Okasaari Navvu Okasaari Yedpu

Chorus
ఈ లోక యాత్రలో నే సాగుచుండ‖ 2x ‖
ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు‖ 2x ‖
అయినను క్రీస్తేసు నాతోడ నుండు‖ 2x ‖
Verse
జీవిత యాత్ర యెంతో కఠినము‖ 2x ‖
ఘోరాంధకార తుఫాను లున్నవి‖ 2x ‖
అభ్యంతరములు యెన్నెన్నో వుండు‖ 2x ‖
కాయువారెవరు రక్షించేదెవరు‖ 2x ‖
Verse
హృదయము శుద్ధి పరచుకొన్నాను
నా చేతులెంతో పరిశుద్ధ పరచ
అనుకొనని రీతి అపవాదివచ్చి
నా జీవితమును నిరాశపరచె
Verse
నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా
అనుదినము నన్ను ఆదరించెదవు
నీతో వున్నాను విడువలేదనెడు
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను
Verse
ఈ అనుభవముతో నేనడచు కొందు
ప్రియ యేసు వైపు నేను చూచుచు
గతమునంత నేను మరచిపోయెదను
కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు
Verse
తోడైయుండెదవు అంతము వరకు
నీవు విడువవు అందరు విడచినను
నూతన బలమును నా కొసగెదవు
నే స్థిరముగ నుండ నీ కోరిక యిదియే

Related Tags

FaithComfortLife Journey