Verse
ఈ లోకంలో జీవించెదను
నీ కొరకే దేవా‖ 2x ‖
నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు
నీలా ప్రేమించే వారు
నీవే నా ప్రాణ ప్రియుడవు‖ 2x ఈ లోకంలో ‖
Verse
(నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా
విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు‖ 2x ‖
ఎంత లోతైనది నీ ప్రేమా
నిన్ను విడచి నే బ్రతుకలేను‖ 2x ఈ లోకంలో ‖
Verse
అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే
నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే‖ 2x ‖
నీ దృష్టిలో నేనున్నాగా
ఇలలో నే జడియను‖ 2x ఈ లోకంలో ‖