Verse
ఈ మరణము కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము‖ 2x ‖
యేసు తెచ్చెను మనకు రక్షణ
ఎంత అద్బుతము ఆ నిరీక్షణ‖ 2x ఈ మరణము ‖
Verse
జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే‖ 2x ‖
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
తిరిగి తన దరికి మనల పిలిచే వేళ‖ 2x ఈ మరణము ‖
Verse
యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు‖ 2x ‖
తిరిగి లేచెదరు యేసు నామములో
కొలువు తీరెదరు పరలోకంలో‖ 2x ఈ మరణము ‖
Verse
కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము మబ్బులను కరిగించును‖ 2x ‖
వేదనలు రోదనలు రద్దు చేయును
గతకాల సంగతులు గతించి పోవును‖ 2x ఈ మరణము ‖