Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Reethigaa Ninnu Sthuthinchagalanu

ఏ రీతిగా నిన్ను స్తుతించగలను

Ee Reethigaa Ninnu Sthuthinchagalanu

Lyricist: Pastor Ravindra Donepati
Verse
ఏ రీతిగా నిన్ను స్తుతించగలను
ఏ రీతిగా నిన్ను కీర్తించగలను
స్తుతించుట నేర్పించుమా
కీర్తించుట నాకు బోధించుమా
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
ఏ రీతిగా నిన్ను స్తుతించగలను
ఏ రీతిగా నిన్ను కీర్తించగలను
Verse
పడిపోయిన నన్ను పతనమైన నన్ను ఎన్నుకున్నావు ఏర్పాటు చేసుకున్నావు
నేను నిన్ను మరిచాను నిన్ను అవమానించాను
నీ సన్నిధికి దూరమయ్యాను నీ సహవాసం పోగొట్టుకున్నాను
అయినా నన్ను ప్రేమించావు నీ వెలుగు నాపై ప్రకాశింపచేసావు
Verse
ఏ రీతిగా నిన్ను స్తుతించగలను
ఏ రీతిగా నిన్ను కీర్తించగలను
Verse
యోగ్యత లేని నన్ను అర్హత లేని నన్ను ఎన్నుకున్నావు ఏర్పాటు చేసుకున్నావు
దీనుడైన నన్ను హీనుడైన నన్ను
పాడైనా నన్ను బాగు చేశావు పతనమైన నన్ను ఫలియింప చేసావు
Verse
నీ ఉన్నత పరిచర్యకై పిలిచావు
నీ సాక్షిగా నన్ను మలిచావు
నీ సాక్షిగా నను మార్చావు
Verse
ఏ రీతిగా నిన్ను స్తుతించగలను
ఏ రీతిగా నిన్ను కీర్తించగలను
Verse
బుద్ది లేని నన్ను ధనము లేని నన్ను ఎన్నుకున్నావు ఏర్పాటు చేసుకున్నావు
ఆత్మల పట్ల భారమును నాకిచ్చావు
నిన్ను ప్రకటించే ఆధిక్యతనిచ్చావు
నా తోడుగనుండి అభయమిచ్చావు
Verse
నీ ఆత్మతో నన్ను అభిషేకించి
నీ కొరకు బ్రతికే భాగ్యమిచ్చావు
నీ కొరకు బ్రతికే భాగ్యమిచ్చావు
Verse
ఏ రీతిగా నిన్ను స్తుతించగలను
ఏ రీతిగా నిన్ను కీర్తించగలను
స్తుతించుట నేర్పించుమా
కీర్తించుట నాకు బోధించుమా
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

Related Tags

PraiseWorshipThanksgiving