Verse
ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము నీ సుదయారస మొల్క
నిత్యంబు మముఁగావు‖ మీ ‖
Verse
చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి
బాపుము తండ్రీ‖ యీ ‖
Verse
దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము
పడకుండఁ గాపాడు‖ మీ ‖
Verse
నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థన లెల్ల
సరగ నాలించుమా‖ యీ ‖
Verse
జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం అనిశము జీవించిరా
జ్యంబుఁ జేయు మామేన్‖ ఈ ‖