Verse
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము
నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు‖ ఈ సాయంకాలమున ‖
Verse
చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో
బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ‖ ఈ సాయంకాలమున ‖
Verse
దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము
భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు‖ ఈ సాయంకాలమున ‖
Verse
నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున
సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా‖ ఈ సాయంకాలమున ‖
Verse
జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం
అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్‖ ఈ సాయంకాలమున ‖