Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Sangham Punaadhi Kreesthae Saadheeshu

ఈ సంఘం పునాది క్రీస్తే సాధీశు

Ee Sangham Punaadhi Kreesthae Saadheeshu

Lyricist: Samuel John Stan
Verse
ఈ సంఘం పునాది
క్రీస్తే సాధీశుఁడే
దక్కించె యేసు దీని
వాక్కాపుల్ రెట్టించే
పై నుండి వచ్చి యేసు
పెండ్లాడె నీమెనే
కోరుచు రక్త మిచ్చి
కొనె నీ కన్యనే
Verse
ఒక్కఁడే దేవుఁడిందు
ఒక్క విశ్వాసము
ఒక్కటే జన్మ మిందు
ఒక్క కుటుంబము
ఒక్క ప్రసాద విందు
ఒకే సునామము
నిరీక్షణొక్క టిందు
నిరంత ప్రాప్తికే
Verse
అసత్య మార్గమంచు
అనేకుల్ నవ్వినన్
విభాగ మై శ్రమంబుల్
విశేష మొందినన్
సుభక్తుల్ వేడుచుంద్రు
అభయ కాంతికై
యీ నింద లెల్లఁ బోయె
ఆనంద నాటికై
Verse
కఠిన దుఃఖ బాధల్
కల్గిన నోర్చుచు
విభ వానంద ప్రాప్తి
లభింపఁ గోరుచు
ఆ స్వర్గ పంక్తిఁజేరి
యానంద మొందుచున్
యీ సంఘ మేసుఁ గూడి
విశ్రాంతి బొందును

Related Tags

WorshipChurchFoundation