Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Sanghapu Bunadi Kristhesadheeshoode Dakkiche Yesu Deeni Vaakkapul Rettiche

ఈ సంఘపు బునాది క్రీస్తేసాధీశుడే దక్కించె యేసు దీని వాక్కాపుల్ రెట్టించే

Ee Sanghapu Bunadi Kristhesadheeshoode Dakkiche Yesu Deeni Vaakkapul Rettiche

Verse
ఈ సంఘపు బునాది - క్రీస్తేసాధీశుడే
దక్కించె యేసు దీని - వాక్కాపుల్ రెట్టించే
పై నుండి వచ్చి యేసు - పెండ్లాడె నీమనే
కోరుచు రక్తమిచ్చి - కొనె నీ కన్యనే
Verse
ఒక్కడే దేవుడిందు - ఒక్కటే మార్గము
ఒక్కటే జన్మ మిందు - ఒక్కటే సత్యము
ఒక్క ప్రసాదమిందు - ఒక్క కష్టంబులే
నిరీక్షణొక్కటిందు - నిరంత ప్రాప్తికే
Verse
అసత్య మార్గమంచు - ననేకుల్ నవ్వినన్
విభాగమై శ్రమంబుల్ - విశేష మొందినన్
సుభక్తుల్ వేడుచుంద్రు - అభయకాంతికై
యీ నిందలెల్ల బోయె - నానంద నాటికై
Verse
కఠిన దుఃఖ బాదల్ - కలిగిన నోర్చుచు
విభవానంద ప్రాప్తి - లభింపగోరుచు
ఆ స్వర్గ పంక్తిజేరి - యానంద మొందుచున్
యీ సంఘ మేసు గూడి - విశ్రాంతి బొందును

Related Tags

JesusChurchFoundation