Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Sthuthi Neeke

ఈ స్తుతి నీకే

Ee Sthuthi Neeke

Lyricist: Timothy Parishapogu
Verse
ఈ స్తుతి నీకే మా యేసు దేవా
(మా) మనసారా నిన్నే సేవింతుము‖ 2x ‖
పరలోక దూతాలి స్తోత్రాలతోనే
మా స్తోత్ర గానాలు గైకొనుమా‖ 2x ఈ స్తుతి ‖
Verse
జగతికి పునాది నీవని
మాలోన ఊపిరి నీదేనని‖ 2x ‖
మా పోషకుడవు నీవేనని
మా కాపరివి నీవేనని‖ 2x ‖
మా హృదయాలలో ఉండాలని
నీ సాక్షిగా మేము బ్రతకాలని‖ ఈ స్తుతి ‖
Verse
మనసారా నీ దరి చేరగా
మాకెంతో సంతోషమాయెగా‖ 2x ‖
హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో
మా హృది ప్రవహించే సెలయేరులా‖ 2x ‖
నీ మధుర ప్రేమను చాటాలని
నీ జీవ బాటలో నడవాలని‖ ఈ స్తుతి ‖

Related Tags

PraiseWorship