Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Taram Yuvatharam Prabhu Yesuke Ankitam

ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం

Ee Taram Yuvatharam Prabhu Yesuke Ankitam

Chorus
ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం
నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము
రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్తను చాటుదాం!
రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్ధాపిద్దాం!
Verse
సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా
దేవుని సేవా వ్యాపారమాయె ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయె
నీవు కాకపోతే ఇంకెవ్వరూ నేడు కాపోతే ఇంకెన్నడూ
రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్తను చాటుదాం!
రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్ధాపిద్దాం!
Verse
నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించె సైన్యం బహుతక్కువాయెగా
యేసయ్య రాకడ సమీపమాయె ఆ వార్త చాటను వేగిర రావే
నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడూ
రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్తను చాటుదాం!
రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్ధాపిద్దాం!

Related Tags

EvangelismDedicationYouthService