Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Tharam Yuvatharam

ఈ తరం యువతరం

Ee Tharam Yuvatharam

Lyricist: P Satish Kumar
Verse
ఈ తరం యువతరం
ప్రభు యేసుకే అంకితం
నా బలం యవ్వనం
ప్రభు యేసుకే సొంతము
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు వార్త చాటుదాం
రా సోదరీ రారా సోదరా
ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం‖ ఈ తరం ‖
Verse
సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా
దేవుని సేవ వ్యాపారమాయే
ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు‖ రా సోదరీ ‖
Verse
నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా
యేసయ్య రాకడ సామీపమాయే
ఆ వార్త చాటను వేగిర రావే
నీవు కాకపోతే ఇంకెవ్వరు
నేడు కాకపోతే ఇంకెన్నడు‖ రా సోదరీ ‖

Related Tags

CommitmentEvangelismYouthService