Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Tharam Yuvatharam Prabhu Yesuke Ankithamu

ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితము

Ee Tharam Yuvatharam Prabhu Yesuke Ankithamu

Chorus
ఈ తరం యువతరం - ప్రభు యేసుకే అంకితము
నా బలం యవ్వనం - ప్రభు యేసుకే సొంతము
రా సోదరీ - రారా సోదరా - యేసు వార్త చాటుదాం
రా సోదరీ - రారా సోదరా - ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం
Say..
లా.. లా ల్ల ల ల ల.. లా ల్ల ల ల ల.. లా ల్ల ల ల ల..‖ 2x ‖
Verse
సువార్త సేవ నానాటికీ - చల్లారిపోయెగా
ఆత్మల సంపద మరి ఎందుకో - అడుగంటిపోయెగా
దేవుని సేవ.. వ్యాపారమాయే - ఆత్మల రక్షణ.. నిర్లక్ష్యమాయే
నీవు కాకపోతే ఇంకెవ్వరు..? నేడు కాకపోతే ఇంకెన్నడు..?
రా సోదరీ - రారా సోదరా - యేసు వార్త చాటుదాం
రా సోదరీ - రారా సోదరా - ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం
Verse
నశించిపోయే ఆత్మలు ఎన్నో - అల్లాడుచుండెనుగా
యేసయ్య ప్రేమ చాటించే సైన్యం - బహు తక్కువాయెగా
యేసయ్య రాకడ.. సమీపమాయే - ఆ వార్త చాటను.. వేగిర రావే
నీవు కాకపోతే ఇంకెవ్వరు..ఇంకెవ్వరు ?
నేడు కాకపోతే ఇంకెన్నడు.. ఇంకెన్నడు ?
రా సోదరీ - రారా సోదరా - యేసు వార్త చాటుదాం
రా సోదరీ - రారా సోదరా - ప్రభు యేసు రాజ్యం స్తాపిద్ధాం

Related Tags

GospelEvangelismDedicationYouth