Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Udayam Shubha Udayam

ఈ ఉదయం శుభ ఉదయం

Ee Udayam Shubha Udayam

Verse
ఈ ఉదయం – శుభ ఉదయం
ప్రభువే నాకొసగిన – ఆనంద సమయం
ఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్
ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్‖ ఈ ఉదయం ‖
Verse
బలహీనమైతి నేను – బలపరచుము తండ్రి
ఫలహీనమైతి నేను – ఫలియింపజేయుము
వాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనము
పరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము‖ ఈ ఉదయం ‖
Verse
అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రి
అల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుము
నీ పాదసన్నిధే – నాకు శరణము
అభయంబునిచ్చెడి – ఆశ్రయపురము‖ ఈ ఉదయం ‖

Related Tags

WorshipPrayerMorning