Verse
ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు
నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు
ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా‖ 2x ఈ ఉదయమున ‖
Verse
తోడు లేని జీవ యాత్ర
చేరలేని కడలి తీరం‖ 2x ‖
బ్రతుకే బరువై పోవగా
క్రీస్తు దరికి సాగి రమ్ము
చేరుకొనుము తీరము‖ ఈ ఉదయమున ‖
Verse
అలల వలె వ్యధలు రాగా
కనుల నీరే తోడు కాగా‖ 2x ‖
అండగా క్రీస్తేసుడుండ
చింత ఏల భీతి ఏల
బంధాలెల్ల వీడెగా
Verse
ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో
నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును
ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం‖ 2x ‖